సార్‌ టికెట్‌ ప్లీజ్‌..

24 Sep, 2018 10:34 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తును ప్రారంభించింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 21తో ముగిసింది. ఆ దరఖాస్తులను టీపీసీసీ కార్యాలయంలో నాయిని అప్పగించారు.
 
వర్ధన్నపేట నుంచి అధికంగా.. 
జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 21 మంది ఆశావహులు టికెట్‌ కోసం దరఖాస్తు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కత్తి వెంకటస్వామి సైతం దరఖాస్తు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ కోసం సిరిసిల్ల రాజయ్య దరఖాస్తు చేశారు. 
దరఖాస్తుదారుల వివరాలు 
నియోజకవర్గాల వారీగా.. 

  • పరకాల: ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గండ్ర జ్యోతి, కేదారి శ్రీనివాసరావు,హవెలీ దామోదర్, అర్షం అశోక్, తుమ్మళ్లపెల్లి వీరన్న
  • నర్సంపేట: తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామి
  • వర్ధన్నపేట: మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నమిండ్ల శ్రీని వాస్, బక్క జడ్సన్, మంద వినోద్‌ కుమార్, సోద రామకృష్ణ, అరూరి రాజు, బందెల రాజభద్రయ్య, ప్రొఫెసర్‌ గాదె దయాకర్, ఏ ప్రభాకర్, జి.మల్లేష్, జి.రాజారాం, పి. యాకస్వామి, ఎన్‌.రమేశ్, హెచ్‌ వెంకటేశ్వర్లు, వడ్డెపల్లి విజయ్‌ కుమార్, సదానందం, మెడకట్ల సారంగపాణి, బాబురావు, బి.సదానందం, మధు ఉన్నారు. భూపాలపల్లి: మాజీ ప్రభుత్వ చీప్‌ విఫ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, నామిని విజయ్‌ కుమార్‌
  • పాలకుర్తి: జంగా రాఘవరెడ్డి, దుగ్యాల శ్రీనివా సరావు, సుమణ, బిల్లా సుధీర్‌రెడ్డి, క్రిష్ణ నాయ క్, సోమేశ్వర్‌రావు దరఖాస్తు చేసుకున్నారు. పావులు కదుపుతున్న నేతలు ఎమ్మెల్యే టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు అందరు హైదరాబాద్‌ బాట పట్టారు. తమ గాడ్‌ ఫాదర్ల దగ్గర పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తమ విజయానికి ఉన్న అన్ని అవకాశాలను పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. ఇందుకు తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటూ జోరుగా లాబీయింగ్‌  చేసుకుంటున్నారు. ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక స్టీరింగ్‌ కమిటీకి కత్తి మీద సాములా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాబలమే ప్రాతిపదిక..

కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఈ సారి టికెట్‌ కేటాయింపులపై ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకే టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడేందుకు మంతనాలు చేస్తున్నారు. పొత్తులు ఖరారయ్యాక  టికెట్ల కేటా యింపు జరగనుంది. నియోజకవర్గాల్లో కుల సమీకరణలు, ప్రజాబలాలను ప్రాతిపదికనే నేతలకు టికెట్లు కేటాయించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సర్వేలు సైతం చేయించి టికె ట్‌ కేటాయిస్తారన్న చర్చ సాగుతోంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో రెండు సార్లు సర్వే నిర్వహించి ఎవరు బలమైన అభ్యర్థి అయితే వారికి టికెట్‌ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పొత్తులు పూర్తి కాగానే కాంగ్రెస్‌కు కేటాయించే స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు