పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించాలి 

28 May, 2018 08:22 IST|Sakshi
వాహనాన్ని తాళ్లతో లాగుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ములుగు : పెంచిన పెట్రోల్, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ములుగు మండల కేంద్రంలో ఆదివారం జాతీయ  రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాటా ఏస్‌ వాహనాన్ని తాళ్లతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మాజీ ఎంపీపీ నలెల్ల కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌ ధరలను తగ్గించి సామాన్యులకు బాసటగా నిలిచామని చెప్పారు.

అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రూ.65 ఉన్న పెట్రోల్‌ ధరను క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం రూ.82కు చేర్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గిస్తామని ప్రగల్బాలు పలికి ప్రస్తుతం సామాన్యడిపై భారం మోపుతుందని అన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోగిల మహేష్, యూత్‌ మండల అధ్యక్షుడు బానోత్‌ రవిచందర్, మండల ప్రధాన కార్యదర్శి హరినాథ్‌గౌడ్, బండారుపల్లి సర్పంచ్‌ జంజిరాల దేవయ్య, నాయకులు ముసినపల్లి కుమార్‌గౌడ్, అశోక్‌గౌడ్, వంగ రవియాదవ్, రాములు, చాంద్‌పాషా, బొల్లం రవి, శ్రీను, దేవరాజు, కట్ల రాజు, కోటి, రజినీకాంత్, రంజిత్, శ్రీకాంత్, నవీన్, రాజు, రాజ్‌కుమార్, సురేష్, వినయ్, యుగేందర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు