సమస్యలపై కాంగ్రెస్ నేతల పర్యటన

8 Oct, 2014 03:08 IST|Sakshi

తొలుత నిజామాబాద్... ఆ తరువాత పాలమూరు
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే అన్ని జిల్లా ల్లో పర్యటించి  క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెం బ్లీ సమావేశాల సందర్భంగా కరెంట్ కష్టాలు, రుణమాఫీ వంటి అంశాలతోపాటు రైతుల ఆత్మహత్యలకు కారణాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 9న తొలుత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ప్రారంభమయ్యే పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌సహా కాంగ్రెస్ ప్రజాప్రతిని దులు, ముఖ్య నేతలంతా పాల్గొననున్నారు.
 
  మంగళవారం సాయంత్రం పొన్నాల నివాసంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమై జిల్లాల పర్యటనలపై చర్చించారు. కమిటీ సభ్యులు పొన్నాల, జానారెడ్డి, డీఎస్, షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పీసీసీ కిసాన్‌సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానంతరం ఆయా నేతలతో కలసి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాలు కడగండ్లు తెలుసుకుని భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమైనట్లు చెప్పారు.
 
 త్వరలో టీపీసీసీ కార్యవర్గ ప్రక్షాళన...
 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం పలువురు పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో సమావేశమై సభ్యత్వ నమోదు, సంస్థాగత మార్పులు చేర్పులపై అభిప్రాయాలు సేకరించారు.
 
 ధైర్యముంటే బహిరంగ చర్చకు రా..
 రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమెవరనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత, విద్యుత్ శాఖ మాజీమంత్రి షబ్బీర్‌అలీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.  మంగళవారమిక్కడ గాం ధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి పదేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమంటూ  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్‌అలీ తీవ్రంగా స్పందించారు.   
 
 కేసీఆర్.. చేతగాకుంటే తప్పుకో: డీకే అరుణ
 విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నించకుండా సీఎం కేసీఆర్ విపక్షాలను విమర్శించడం విడ్డూరమని కాంగ్రెస్  ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. విద్యుత్ సవుస్యను పరిష్కరించడం చేతగాకుంటే కేసీఆర్ పదవి నుంచి తప్పుకోవాలని సీఎల్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

మరిన్ని వార్తలు