రైతుల ఆత్మహత్యలు పట్టవా?: శ్రీధర్‌బాబు

12 Apr, 2017 01:46 IST|Sakshi
రైతుల ఆత్మహత్యలు పట్టవా?: శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శిం చారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చిని కొనుగోలు చేయకపోవడంతో పంటను మంటలో కాల్చేసుకోవాల్సిన రైతుల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ సంస్థలతో మిర్చిని కొనుగోలు చేయించాలని కోరారు. మిర్చిని క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించి, ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్ల కోసమే కలెక్టర్ల సమావేశం పెట్టుకున్నట్లుగా ఉందని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు