బీసీల ప్రాబల్యాన్ని ఎలా కాపాడుకుందాం?

11 Jul, 2017 01:55 IST|Sakshi

14న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ముఖ్యుల భేటీ
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో ప్రాబ ల్యాన్ని కాపాడుకోవడానికి నిర్దిష్ట కార్యాచరణ కు దిగాలని బీసీ ముఖ్య నేతలు నిర్ణయించుకు న్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ముఖ్య నేతలంతా పార్టీలో బీసీల ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి అనుస రించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఈ నెల 14న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు దక్కిన వాటాను కాపా డుకుంటూనే పార్టీలో ముఖ్యమైన స్థానంలోకి చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాలని భావిస్తున్నారు.

2014 ఎన్నికల్లో బీసీలకు పార్టీ సరైన ప్రాధాన్యత ఇచ్చిందని, ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలకు కలిపి 35 మంది బీసీలకు టెకెట్లు ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. అయితే వాటిలో ఎవరూ గెలవకపోవడం ఇబ్బందికర అంశమేనని అంటున్నారు. బీసీల కు గత ఎన్నికల్లో వచ్చినన్ని టికెట్లను సాధిం చుకోవడానికి, వాటిని గెలుచుకోవడానికి తగిన కార్యాచరణ, వ్యూహం ఉండాల్సిందేని పార్టీలోని సీనియర్లు భావిస్తున్నారు. అలాగే అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి ఉద్య మకార్యాచరణను ప్రకటించాలని సూత్రప్రా యంగా నిర్ణయించుకున్నారు.

టీఆర్‌ఎస్‌ ఆకర్షణలను తిప్పికొడదాం..
బీసీలను ఆకర్షించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పథకాల్లో లోపాలపై పార్టీపరంగా పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశాలున్నాయని బీసీ ముఖ్య నాయకుడొకరు పేర్కొన్నారు. ముఖ్యంగా అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీ యడం ద్వారా యాదవ, బెస్త, ముదిరాజ్‌ కులాలపై టీఆర్‌ఎస్‌ ఆకర్షణలను తిప్పికొ ట్టొచ్చన్నారు.

ఇటువంటి అంశాలపై ఇప్పటి దాకా ఉద్యమించడంలో పార్టీ నేతలంతా సమష్టిగా విఫలమైనా 14న జరిగే బీసీల వ్యూహ సమావేశంలో విశ్లేషించుకోవాల్సి ఉం దన్నారు. బీసీల్లో పార్టీ ప్రాబల్యం పెంచడానికి భారీ బహిరంగసభను ఏర్పాటుచేసే యోచన ఉందని ఆ నాయకుడు వెల్లడించారు. 14న జరిగే భేటీకి టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరలు హాజరవుతారని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు