కాంగ్రెస్‌ పార్టీ.. కొత్త యాప్‌

30 Jun, 2018 14:11 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న శక్తి యాప్‌ ఏఐసీసీ అనాలిటిక్‌ కోఆర్డినేటర్‌ స్వప్న   

వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు గ్రామస్థాయి కార్యకర్తలను అనుసంధానం చేసేందుకే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘శక్తి’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని ఏఐసీసీ అనాలిటిక్‌ కోఆర్డినేటర్‌ స్వప్న తెలిపారు. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ‘శక్తి’ యాప్‌పై అవగాహన సదస్సు జరిగింది.

ఈసందర్భంగా స్వప్న మాట్లాడుతూ ఈ యాప్‌లో నమోదైన తర్వాత నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలు, సూచనలను రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పంపించవచ్చని అన్నారు. ఇప్పటి వరకు పార్టీకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌తో పాటు డేటా అనాలిటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అనే కొత్త విభా గం ఏర్పాటు చేశారని వివరించారు. నాయకులు, కార్యకర్తల పనితీరును గుర్తించి మండల, గ్రామ స్థాయి పదవులను గుర్తుచేస్తామన్నారు.

శక్తి యాప్‌లోకి జులై 17 వరకు లక్ష మందిని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శక్తి యాప్‌ రాష్ట్ర కోఆర్డినేటర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి అన్నారు. క్రమేపీ సంఖ్యను మూడు లక్షలకు పెంచి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్‌ నేతలు పార్టీలోకి యువతను తీసుకురావాలని కోరారు. సెల్‌ నెం.7993179961ను శక్తి ఏఐసీసీ నంబర్‌గా సేవ్‌ చేసుకోవాలని సూచిం చారు.

ఓటర్‌ ఐడీ నంబర్‌ను.. శక్తి ఏఐసీసీ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే ‘సభ్యత్వాన్ని స్వీకరించాం’ అని లేదా ‘ప్రాసెస్‌లో ఉంది’ అని సందేశం వస్తుందన్నారు. సభ్యత్వాన్ని ఏఐసీసీ స్వీకరించినట్లు శక్తి యాప్‌లో మెసేజ్‌ వస్తే.. పార్టీ వివరాలు తెలుసుకోవడంతో పాటు సూచనలు చేయవచ్చన్నారు.

 గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ విజయరామారావు, కొండేటి శ్రీధర్, డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, మహబూబాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భూక్యా ఉమ, అనుబంధ సంఘాల నాయకులు పోశాల పద్మ, కొత్తపల్లి శ్రీనివాస్, అయూబ్, గ్రేటర్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బంక సరళాసంపత్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు