కార్మికులపై కక్ష సాధింపు సరికాదు : కాంగ్రెస్‌

17 May, 2018 19:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జరుగుతన్న అన్యాయం పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మడిపండ్డారు. గురువారం ప్రగతి భవన్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడారని  అలా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఆనాడు ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ప్రకటించిన ఆయన ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు.

గతంలో మంత్రిగా ఉండి ఆర్టీసీని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తెచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోక పోవటం  ఏంటనీ ప్రశ్నించారు. కేరళ రాష్ట్రంలో ఆర్టీసీకి మూడు వేల కోట్లు, తమిళనాడులో నాలుగు వేల కోట్లుకు పైగా కేటాయిస్తే, మన రాష్ట్రంలో నాలుగేళ్లకు గాను కేవలం 11 వందల కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజల్‌ పన్ను పై రెండు వేల 690 కోట్లు వసూలు చేస్తోందన్నారు. ఈ పన్నును ఎత్తివేస్తే ఆర్టీసీ లాభల్లోకి వస్తుందని సూచించారు.

బస్సు పాస్‌ రాయితీ, ప్రీడమ్‌ ఫెటర్స్‌, జర్నలిస్టులకు రీయంబర్స్‌మెంట్‌ చేయడం లేదన్నారు. ఆర్టీసీ నుంచి రోజుకు 12 కోట్లు ఆదాయం వస్తే దానిని తిరిగి రాష్ట్ర సర్కార్‌కు 1.8 టాక్సీ చెలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన 300 కోట్లు బకాయిలు తిరిగి ఆర్టీసీకి చెల్లించాలి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుపై కక్ష సాధింపు చర్యలు మాని, సాధ్యమైనంత తొందరగా పీఆర్‌సీని పెంచాలని డిమాండ్‌ చేశారు. రెండు వేల 800 వందల కోట్లు రాష్ట్ర సర్కార్‌ నిర్ణయాల వల్లే వచ్చింది, కానీ ఆర్టీసీ కార్మికుల వల్ల కాదని చిన్నారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు