మండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ

30 Jun, 2014 12:37 IST|Sakshi

హైదరాబాద్ :  సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం శాసనమండలిలో పాగా కోసం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం గాంధీభవన్లో సమావేశం అయ్యారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎంపికపై నేతలు ఈ భేటీలో కసరత్తు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీని చైర్మన్ ఎన్నికలో ధీటుగా ఎదుర్కొనేందుకు మైనార్టీ, ఎస్సీ ఎమ్మెల్సీల్లో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టాలని యోచిస్తోంది.  

పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరడంతో చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, ఎమ్మెల్యే జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు  శాసనమండలి చైర్మన్ పదవికి పార్టీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ పేరును కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


 

మరిన్ని వార్తలు