సమ్మెకు కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతు

8 Oct, 2019 11:11 IST|Sakshi
ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు

మూడో రోజుకు ఆర్టీసీ కార్మికుల పోరు

ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరిక

ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు

సాక్షి, గోదావరిఖని: సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోబోమంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఆర్టీసీలో సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర డిమాండ్లతో చేపట్టిన సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం, పలు సంఘాల నిరసన కార్యక్రమాలతో తీవ్రతరమైంది. కార్మి కులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. ఉదయం 6గంటలకే డిపో వద్దకు చేరు కుని నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సూచనల మేరకు నిరసనలు చేపట్టారు. మంథని, గోదావరిఖని డిపోల పరిధిలో పనిచేసే డ్రైవర్లు, కం డక్టర్లు, ఉద్యోగులు బస్టాండ్లకు సమీపంలో నిరసన తెలిపారు.

గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ కాలనీలో ఆర్టీసీ ఉద్యోగులు బస్‌ డిపోకు 300 మీటర్ల దూరంలో ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మె ల్యే శ్రీధర్‌బాబు మంథనిలో, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి బస్టాండ్‌లో ప్రదర్శనలో పాల్గొన్నారు.  తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలోచించకుండా నియంతలా వ్యవహర్తిస్తున్నా డని ఆరోపించారు. ఉద్యోగుల హక్కుల కోసం అన్నివర్గాల ప్రజలు సహకరించాల ని కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్, రాజయ్య, లక్ష్మణ్, మసూద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  రీజియన్‌లో 505 బస్సులు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌లో ఆర్టీసీ బస్సులు 302, అద్దె బస్సులు 203 మొత్తం 505 బస్సులు నడిపించారు.  తాత్కాలిక కండక్టర్లు 302, డ్రైవర్లు 302మందితో బస్సులు నడిచాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా