జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేస్తాం 

15 Nov, 2018 14:35 IST|Sakshi
నామినేషన్‌ వేసిన అనంతరం మాట్లాడుతున్న ప్రసాద్‌కుమార్‌  

 టీఆర్‌ఎస్‌ ప్రజలకు అన్యాయం చేసింది 

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాద్‌కుమార్‌  

సాక్షి, వికారాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బుధవారం ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించిన టీఆర్‌ఎస్‌ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలో అన్ని స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటుగా కొత్తగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లాకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాలలో అన్యాయం చేసిందని ఆరోపించారు.

ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల డిజైన్లు మార్చి జిల్లాకు తాగునీరు, సాగునీరు రాకుండా అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వికారాబాద్‌కు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. శాటిలైట్‌ సిటీకి కేంద్రం నుంచి సుమారుగా రూ.3వేల కోట్లకు పైగా రావాల్సిన నిధులను రాబట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. తాను ఆరు సంవత్సరాల ఎమ్మెల్యేగా, మంత్రిగా వికారాబాద్‌ నియోజకవర్గానికి రూ.600కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. 2008 ఎన్నికల పునరావృతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గురువారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే 
బంట్వారం: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కోట్‌పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎల్లమ్మ గుట్ట వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల భారీర్యాలీ మధ్యన  తరలివెళ్లారు. నాగసాన్‌పల్లి, మోత్కుపల్లి, బార్వాద్, కరీంపూర్, ఎన్కేపల్లి, నాగసాన్‌పల్లితండా, బార్వద్‌తండా, మద్గుల్‌ తండాలో రోడ్‌షో నిర్వహించి సుదీర్ఘంగా ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను మించిన మోసకారి ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. రాజీవ్‌ఆరోగ్యశ్రీ, 108 పథకాలతో ఎంతో మంది ప్రాణాలు నిలబడాడ్డయని, ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారన్నారు. టీఆర్‌ఎస్‌ మునిగే నాలావలాంటిదన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎంఎ.వాహిద్‌ ,మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అయూబ్‌ అన్సారి, రాంచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, ఫయాజ్, శ్రీనివాస్‌గౌడ్, అనంత్‌రాంగౌడ్, మహేశ్వర్‌రెడ్డి ,ప్రభాకర్‌రెడ్డి, రాంచద్రరెడ్డి, మాధవ్, సురేందర్, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, రాజు, అనిల్, రామునాయక్, రమేష్‌రాథోడ్, వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు