వీణా– వాణీ కోరిక

16 Oct, 2017 14:59 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఉందని అవిభక్త కవలలు వీణా– వాణీ తెలిపారు. భవిష్యత్తులో ఇంజినీర్‌, సైంటిస్ట్‌ కావాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటోంది. ఆపరేషన్‌ చేసి వీణా– వాణీలను విడదీయాలని ప్రభుత్వానికి తండ్రి మురళి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది తన పిల్లలిద్దరూ విడివిడిగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణీలను విడదేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలించలేదు. విదేశాల నుంచి కూడా వైద్యులు వచ్చి వీరిని పరీక్షించారు. కానీ వారికి ఆపరేషన్ చేస్తే బతికే అవకాశాలు తక్కువని వైద్యులు అభిప్రాయపడడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. పుట్టినప్పటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఎక్కువ కాలం గడిపిన ఈ చిన్నారులను తర్వాత స్టేట్‌హోం తరలించారు. గతేడాది ఐదో తరగతి చదివిన వీణా–వాణీలకు ఐక్యూ బాగుండటంతో ఈ ఏడాది ఏడో తరగతికి ప్రమోట్‌ చేశారు.

మరిన్ని వార్తలు