ఇరుకు గదులతో ‘వంట’కు తంటా!

9 Mar, 2019 08:25 IST|Sakshi
ద్వారకనగరంలో అసంపూర్తిగా వంటగది

ఆరుబయటే‘మధ్యాహ్న భోజనం’ 

పొగతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులు    

సాక్షి, మదనాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరుబయటే వండుతున్నారు. ఆరుబయట కట్టెలపొయ్యిపై వండుతుండంతో విద్యార్థుల కళ్లు మండుతున్నాయి. చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక వంటగదులు కట్టించాలని, సిలిండర్లు సరఫరా చేయాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. 

మండలంలో ఇదీ పరిస్థితి.. 
మండలంలో 19 ప్రాథమిక పాఠశాలు 4జిల్లా పరిషత్‌ పాఠశాలలు, 1 యూపీఎస్‌ పాఠశాల, 1 కస్తూర్బాగాందీ బాలికాల పాఠశాల, 1 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు ఉన్నాయి. మొత్తం 2110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆచరణలో సమగ్రంగా అమలు చేయడం లేదు. 

ఆరు బయటే వంట.. 
ప్రధానంగా మదనాపురం మండల కేంద్రంతో పాటు దుప్పల్లి ద్వాకరనగరం ,నర్సింగపురం కరివెన, తదితర  గ్రామాల్లో వంట గదులు చిన్న గా ఉండటం తో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వంట చేసే సమయం లో వంట చెరుకు వలన వచ్చె పొగ బయటకు పోక పోవడంతో ఆగది పోగతో కమ్ముకుంటుందని చెబుతున్నారు.దీంతో తాము గదుల్లో వంట చేయడం లేదని నిర్మాణ సమయంలో సరిౖయెన పారదర్శకాలు పాటించ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక బయట వంట చేసి కొన్ని సమయాల్లో ఆరు బయటనే అన్నము వడ్డిస్తున్నామని పలువరు అంటున్నారు. 

కుక్కల స్వైరవిహారం  
పాఠశాల లో ప్రహరీ లేని చోట మదనాపురం పీఎస్‌ సంతబజార్, గోపన్‌పేట పీఎస్, కరివెన పీఎస్, గోవిందహళ్లీ పీఎస్, బౌసింగ్‌తండాపీఎస్, పెద్దతండా పీఎస్‌ తదితర పాఠశాలల్లో మధ్యాహన భోజన సమయంలో పందులు, కుక్కలు సైర విహారం చేస్తాయి. 
ఈ విషయమై విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారులు స్పందించి ఆరు బయట వంట చేయకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించా లని విద్యావంతులు కోరుతున్నారు. 
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా