రంజాన్‌ విధుల్లో.. కానిస్టేబుల్ మృతి

5 Jun, 2019 11:26 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : రంజాన్‌ పర్వదినాన నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వర్తిస్తుండగానే ట్రాఫిక్‌ కానిస్టేబుల్ పుల్లూరి ఆనంద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఖిల్లా ఈద్గా వద్ద రంజాన్ పండుగ విధుల్లో ఉన్న ఆనంద్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారని వైద్యుల నిర్ధారించారు.

కానిస్టేబుల్ ఆనంద్‌కి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆనంద్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆనంద్‌ మృతిపట్ల సీపీ కార్తికేయ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు.


 

మరిన్ని వార్తలు