బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా పట్ల హర్షం

4 Aug, 2018 01:39 IST|Sakshi

ఆర్‌.కృష్ణయ్యను అభినందించిన 45 బీసీ సంఘాల నేతలు  

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగబద్ధమైన జాతీయ బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని గత 25 ఏళ్లుగా ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు ఫలించాయని బీసీ, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. శుక్రవారం బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆర్‌.కృష్ణయ్యను 45 సంఘాల నేతలు సత్కరించారు. బిల్లుకోసం ఆర్‌.కృష్ణయ్య 40 రోజులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, 36 జాతీయ పార్టీలను కలసి చర్చించారన్నారు.

కృష్ణయ్య చొరవ వల్లే బిల్లుకు లోక్‌సభలో మద్దతు లభించిందని జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ కొనియాడారు.Üమావేశంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, రామలింగం, గుజ్జ రమేష్, భూపేష్‌ సాగర్, రామకృష్ణ, జైపాల్‌తో సహా 45 సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ పార్లమెంట్‌లో చరిత్రాత్మక బిల్లును పాస్‌ చేసినందుకు ప్రధాని మోదీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా