నత్తనడకన ‘‘డబుల్‌ ఇళ్ల’’ నిర్మాణం

9 Mar, 2019 09:31 IST|Sakshi
అప్పన్నగూడెంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

సాక్షి, మోతె(నల్గొండ) : మండలంలో మోతె, అప్పన్నగూడెం, విభళాపురం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు నిర్మించి ఇవ్వనున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. అంతేకాకుండా పనుల్లో నాణ్యత లోపిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో సిమెంట్‌ తక్కువగా ఉండి కంకర, ఇసుక ఎక్కువగా కలిపి నాసిరకంగా నిర్మిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

అధికారులు పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. సొంతింటి కల నెరవేరేనా అని పేదలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పన్నగూడెంలో గ్రామానికి ఊరుబయట 40 ఇళ్లు నిర్మిస్తున్నారు. పనులు మొదలు పెట్టి ఏడాది గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. గ్రామంలో సుమారుగా 50 మందికి పైగా పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. అధికారులు  స్పందించాలి.

నాణ్యతగా నిర్మించాలి
మండలంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో కాంట్రాక్లర్లు నాణ్యత పాటించాలి. ప్ర భుత్వం నిబంధనల ప్ర కారం కాంట్రాక్లర్లు వ్యవహరించాలి. పిల్లర్‌ స్థా యిలో వాటర్‌ క్యూరింగ్‌ చేయాలి. పనులు స కాలంలో పూర్తి చేయాలి.
–  లచ్చుమళ్ల అనిల్, మోతె

త్వరితగతిన పూర్తి చేయిస్తాం
మండలంలో మోతె, విభళాపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న 170 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తి కావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇళ్లు నిర్మిస్తున్న గ్రామాలను విజిట్‌ చేస్తున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు çపర్తయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. 
  – రంగయ్య, పీఆర్‌ ఏఈ 
 

మరిన్ని వార్తలు