‘ఆఫీస్‌ కమ్‌ హోం’

18 May, 2020 04:06 IST|Sakshi

వర్క్‌ ఫ్రం హోం నేపథ్యంలో మారనున్న ఇంటిరూపు..

ఫ్లాట్‌.. కామన్‌ వర్క్‌ స్పేస్‌తో కొత్త అపార్ట్‌మెంట్లు

ఐటీ కారిడార్లలో ఈ తరహా నిర్మాణాలకు బిల్డర్ల ప్లాన్‌

బిర్లా ఎస్టేట్స్‌ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో మున్ముందు హైదరాబాద్‌లో నిర్మాణ రంగం దశ–దిశ మార్చు కోనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ ఇళ్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలకే పరిమితమైన నిర్మాణాలు.. రాబోయే రోజుల్లో ఇల్లు– ఆఫీసు కలిసి ఉండేలా ‘ఆఫీస్‌ కమ్‌ హోం ఫ్లాట్ల’ను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని బిర్లా ఎస్టేట్స్‌ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయ నంలో తేలింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు చెందిన సుమారు 1,500 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగి స్తున్నాయి.

వీటిలో ఏడు లక్షల మంది వరకు ఉపాధి పొందు తున్నట్టు హైదరా బాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసి యేషన్‌ వర్గాల అం చనా. తాజాగా పలు కంపెనీలు 30% ఉద్యో గులు, మరికొన్ని 50, ఇం కొన్ని 70% మందితో కార్యకలా పాలు కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాయి. అయితే కరోనా విసిరిన సవాలుకు వృత్తి ఉద్యోగాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ‘ఆఫీస్‌ కమ్‌ హోమ్‌’ సౌలభ్యం ఉండే అపార్ట్‌మెంట్లకు ఐటీ, బహుళజాతి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయ ని, కనీసం 20% మంది ఉద్యోగులు ఇలాంటి ఫ్లాట్లలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతా రని ఈ అధ్యయనం అంచనా వేసింది.

హౌస్‌ కమ్‌ కామన్‌ వర్క్‌ స్పేస్‌
సమీప భవిష్యత్‌లో గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, నానక్‌రాంగూడ తదితర ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో నిర్మించే బహుళ అంతస్తుల నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అపార్ట్‌మెంట్లలో ఒకవైపు ఉద్యోగులు నివాసం ఉండేందుకు డీలక్స్, సూపర్‌డీలక్స్‌ ఫ్లాట్లు.. మరోవైపు వివిధ కంపెనీల్లో, లేదా ఒకే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఒకేచోట..అదీ భౌతికదూరం పాటిస్తూ తమ ఆఫీసు కార్యకలాపాలు కొనసాగించు కునేందుకు వీలుగా కామన్‌ వర్క్‌ స్పేస్‌ ఉండేలా తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఈ అధ్యయనం తెలిపింది.

నగరంలోని ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. బహుళ అంతస్తుల సువిశాలమైన నివాస సముదాయాల నిర్మాణంతో ఆఫీస్‌ స్పేస్‌కు మోస్తరుగా డిమాండ్‌ తగ్గడంతోపాటు కామన్‌ వర్క్‌స్పేస్‌ ఏర్పాటుతో పలు కంపెనీలకు నూతన బ్రాంచీల ఏర్పాటుకయ్యే వ్యయం కూడా భారీగా తగ్గనుందని అంచనా వేసింది. ఇక ఆఫీస్‌ కమ్‌ హోం అపార్ట్‌మెంట్లలో ఉద్యోగులు రిలాక్స్‌ అయ్యేందుకు వీలుగా కెఫేటేరియా, కామన్‌ జిమ్, స్విమ్మింగ్‌పూల్, వీడియో కాన్ఫరెన్స్, బిజినెస్‌ మీట్‌ల ఏర్పాటుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్‌ హాల్స్‌..అందుకు అనుగుణమైన ఫర్నిచర్‌ను కూడా నిర్మాణ సంస్థలే ఏర్పాటుచేసి ఈ భవనాలను తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొంది.

నయాట్రెండ్‌ అనివార్యం..
రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగులు హోమ్‌ కమ్‌ ఆఫీస్‌ నిర్మాణాల వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఈ దిశగా బిల్డర్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా నిర్మాణరంగం పురో గమించాలి. – వి.ప్రవీణ్‌రెడ్డి, మైత్రీ కన్‌స్ట్రక్షన్స్, ఎండీ

మరిన్ని వార్తలు