పూర్తి కావొస్తున్న సూర్యక్షేత్రం..!

6 Dec, 2019 08:08 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న ఆలయం

ఏపీలోని అరసవెల్లి దేవాలయ తరహాలో నిర్మాణం

తెలంగాణలోనే తొలి సూర్యనారాయణ క్షేత్రం ఇదే..

రూ.2కోట్లతో ఆలయ పనులు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు

సీఎం, గవర్నర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం

ముమ్మరంగా ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా తిమ్మాపురం శివారు పర్వత శ్రేణుల నడుమ క్షేత్ర నిర్మాణం

అర్వపల్లి (తుంగతుర్తి) : తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా నిర్మిస్తున్న అఖండజ్యోతి స్వరూప శ్రీసూర్యనారాయణస్వామి మహాక్షేత్రం పనులు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నచిన్న సూర్యదేవాలయాలు ఉన్నాయే తప్ప సూర్యభగవానుడి క్షేత్రం ఎక్కడా లేదు. తొలిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని శ్రీపురంగిరులలో సూర్యాపేట ప్రాంతానికి చెందిన కాకులారపు జనార్దన్‌రెడ్డి–రజిత దంపతులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో మూడు గిరులు (గుట్టల మధ్య) ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని వనాల నడుమ ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఆలయంతో పాటు దేవస్థాన కార్యాలయ భవనం, గోశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ నక్షత్రవనం, ధ్యానమండపం తదితర వాటిని నిర్మించ తలపెట్టారు.

అయితే పర్వత శ్రేణుల మధ్య నిర్మించే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో అఖండజ్యోతి మూలాధారం. ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తూ సూర్యభగవానుడు చుట్టూ ఉండే సప్త ఆలయాల్లో సప్తవర్ణాలలో దర్శనమిస్తారు. అంతే కాకుండా ఇక్కడ కాస్మిక్‌ ఎనర్జీ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాస్మిక్‌ ఎనర్జీ అంటే సూర్యుడు కాలగమనంలో ఒక్కొక్క మాసం ఒక్కో రాశిలో ప్ర వేశిస్తారు. ఆ రాశి సంయమనం ప్రకారం కాంతి తీవ్రత ఉం టుంది. ఈ ఎనర్జీ మనిషి యొక్క ఆలోచనలను ఎంతో ప్రభా వితం చేస్తాయి. మేధాశక్తిని పెంపొందిస్తుంది. దీంతో ఈ క్షే త్రం రాబోయే రోజుల్లో గొప్ప విశిష్టత సంతరించుకునే అవకా శం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సూర్యనా రాయణస్వామి దర్శనం అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకా కుళం జిల్లా అరసవెల్లికి వెళుతున్నారు. త్వరలో తెలంగాణ ప్ర జలకు సూర్యభగవానుడి దర్శన బాగ్యం ఇక్కడే కలగనుంది.
 
రూ.2కోట్లతో క్షేత్రం నిర్మాణం..
సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతోంది. సూర్యనారాయణస్వామి గర్భగుడి, చు ట్టూ ఏడు సప్తవర్ణ ఆలయాలు, ఈ క్షే త్రంపై రాజ గోపురం నిర్మాణం పూర్తయ్యాయి. దేవాలయ కార్యాలయం రెండు అంతస్తుల్లో నిర్మించా రు. పశువుల కోసం గోశాల నిర్మాణం జరుగుతోంది. ఆల యం ఎదుట ధ్యానమందిరం నిర్మా ణం పూర్తయింది. మిగి  లిన పనులు జరుగుతున్నాయి. 

ఫిబ్రవరి 24నుంచి ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు
ఈ అఖండజ్యోతి స్వరూప పంచాయతన దేవాలయ ప్రతిష్ఠ, మహా సౌరయాగ మహోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24నుంచి మార్చి 5వరకు జరపాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అరసవెల్లి దేవస్థాన అర్చక బృందం మహా సౌరయాగ మహోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ యాగానికి ఐదుగురు పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నారు. అలాగే 36మంది రుత్వికులు 420మంది జంటలచే మహాసౌరయాగాన్ని 13రోజుల పాటు నిర్వహించనున్నారు.

సీఎం కేసీఆ ర్, గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌తో పాటు చినజీయర్, స్వరూపనంద స్వాములతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్వాములను పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవాలను రూ.కోటి వ్యయంతో నిర్వహిస్తున్నారు. ఇక్క డి క్షేత్రం తూర్పు దిశలో మూడు పర్వతాల మధ్య ఉన్నందున ఏపీలోని అరసవెల్లి దేవాలయం మాదిరిగా అభివృద్ధి చెందుతుందని దేవాలయ వ్యవస్థాపకుడు జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రతిష్టా, మహాసౌరయాగ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావాలని కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు