‘బంగారుతల్లి’ని కొనసాగిస్తాం

10 Oct, 2014 23:48 IST|Sakshi
‘బంగారుతల్లి’ని కొనసాగిస్తాం

పరిగి: బంగారుతల్లి పథకాన్ని కొనసాగిస్తామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయున విలేకర్లతో వూట్లాడారు. గత ప్రభుత్వ పథకాలైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే కొనసాగిస్తామని చెప్పారు. బంగారుతల్లి పథకం విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

జిల్లాలో కోట్‌పల్లి, లక్నాపూర్, సాలార్‌నగర్ ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. 1.20 లక్షల మంది రైతులకు జిల్లాలో రుణమాఫీ వర్తించిందని చెప్పారు. ఇప్పటికే 25శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేయగా మిగతా నిధులకు ప్రభుత్వం బ్యాంకులకు బాండ్లు ఇస్తుందన్నారు.  ఎస్టీలకు, మైనార్టీలకు కల్యాణలక్ష్మి పథకం నవంబర్  1వ తేదీ నుంచి అమలుచేస్తామని తెలిపారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన 500 జనాభా పైబడిన తండాలన్నీ పంచాయుతీలుగా మారనున్నాయన్నారు. కొత్తగా 200 బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు.

కళ్యాణలక్ష్మి బీసీలకు, ఎస్సీలకు, నిరుపేద ఓసీలకు కూడా వర్తింపజేయాలని పరిగి మాజీ జెడ్పీటీసీ ఎస్పీ బాబయ్య కోరగా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల మహేష్‌రెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్‌మహేమూద్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ, పరిగి సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్, మాజీ జెడ్పీటీసీ ఎస్పీ బాబయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భాస్కర్, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి అశోక్‌రెడ్డి నాయుకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు