కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపు

23 Dec, 2016 00:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రస్తుత మున్న వేతనాలపై 50 శాతం పెంపునకు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం సంతకం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక్కో లెక్చరర్‌కు రూ.18 వేలు ఉండగా, దానిని రూ.27 వేలకు పెంచేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆ ఉత్తర్వుల జారీకి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాష్ట్రంలోని 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రయోజనం చేకూరనుంది.

మరిన్ని వార్తలు