కాంట్రాక్టు పనుల్లో ‘కంగాళీ’

27 Dec, 2017 02:22 IST|Sakshi

5 శాతం జీఎస్టీకి ఇంకా రాని నోటిఫికేషన్‌

లెక్కలు తేల్చలేక పన్నుల శాఖలో గందరగోళం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం  చేప డుతోన్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీ య, గృహాలు, ప్రాజెక్టుల నిర్మా ణం తది తర కాంట్రాక్టు పనులకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వర్తింపజేసే విధానంలో గందరగోళం నెలకొంది. ఈ కాంట్రాక్టు పనులపై తొలుత 18 % జీఎస్టీ విధించగా, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు దానిని 12 శాతానికి తగ్గించారు. అయినా 12% జీఎ స్టీ కూడా  భారం అవుతోందనే ఆలోచన తో దాన్ని 5 శాతానికి తగ్గించాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేసే అన్ని కాంట్రాక్టు పనులకు, మట్టిపని 60 శాతానికి మించి ఉండే ప్రైవేటు వర్కులకు మాత్రమే 5% వర్తింపజేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదించింది. అయితే ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఇంతవరకు విడుదల చేయకపోవడం గందరగోళానికి కారణమవుతోంది.

అడ్వాన్సులిచ్చేస్తున్నారు
ఇంతవరకు కేంద్రం ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు 5 శాతం జీఎస్టీని కలిపి బిల్లులు చెల్లిస్తోంది. కాంట్రాక్టర్లపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నోటిఫికేష న్‌ రాకపోవడంతో తమకు 12 శాతం అడ్వాన్సులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కో రుతున్నారని సమాచారం. లేదంటే తొలు త నిర్ణయించిన విధంగా 10 శాతమైనా చెల్లించాలని ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీఎ స్టీని కలుపుకుని అడ్వాన్సులు తీసుకుం టున్న కాంట్రాక్టర్లు ఆ మేరకు జీఎస్టీ చెల్లింపులు చేయడం లేదని, ప్రతి నెలా చెల్లించాల్సిన దాంట్లో జీఎస్టీ చూపించ కుండా, చివరి బిల్లు వరకు వాయిదా వేస్తున్నారని పన్నుల శాఖ అధికారులంటు న్నారు.

ఓవైపు పన్ను భారం పడకుండా ముందే ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, మరోవైపు చివరి వరకు పన్ను చెల్లించకుండా వాయిదా వేయడం ద్వారా వందల కోట్ల రూపాయలను మా ర్కెట్‌లో కాంట్రాక్టర్లు చలామణి చేస్తూండ టం గమనార్హం. మరోవైపు మొత్తం పనులపై జీఎస్టీ 12 శాతమైనా, 5 శాతౖ మెనా, ఆ పనులకు వినియోగించే ముడి సరుకులపై మాత్రం 18 నుంచి 28 శాతం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కూడా తీసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు లభిస్తోందని పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. మొత్తం పనులపై 5% జీఎస్టీ చెల్లించి, ఐటీసీ 18 నుంచి 28 శాతానికి తీసుకుంటే ప్రభుత్వమే కాంట్రా క్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించాల్సి వ స్తుందని, దీనివల్ల వందల కోట్ల రూపాయల భారం పడుతుందని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఏదీ తేలకుండా, పన్ను కట్టకుండా ఉంటే చివర్లో ఈ కాంట్రాక్టు పనులకు జీఎస్టీ లెక్కలు తేల్చడం కూడా తమకు తలకు మించిన భారమవుతుందంటున్నారు.

>
మరిన్ని వార్తలు