వలసకార్మికుల కోసం కంట్రోల్‌ రూమ్‌

13 Apr, 2020 04:46 IST|Sakshi

కేంద్రకార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

ఫోన్‌/ఆన్‌లైన్‌లో  ఫిర్యాదుల స్వీకరణ

కంట్రోల్‌ రూమ్‌ నిర్వహణ, ఫిర్యాదుల

పరిష్కారానికి ప్రత్యేక అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసకార్మికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఉపక్రమించింది. కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు/కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రాంతాల వారీగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ రీజియన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నిర్వహణకు ప్రాంతీయ కార్మిక కమిషనర్‌తో పాటు ఇద్దరు సహాయ కార్మిక కమిషనర్లను నోడల్‌ అధికారులుగా కేంద్ర కార్మిక శాఖ నియమించింది.

వీలైన పద్ధతిలో ఫిర్యాదులు
కేంద్ర కార్మిక శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు మూడు పద్ధతుల్లో ఫిర్యాదులు/వినతులు అందించవచ్చు. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. లేదా లిఖిత పూర్వక ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్‌ రూమ్‌ ఈమెయిల్‌కు వినతి ఇవ్వవచ్చు. అదేవిధంగా పరిస్థితిని ప్రత్యక్షంగా వివరించదలిస్తే వాట్సాప్‌ ద్వారా వీడియో లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చు.

కంట్రోల్‌ రూమ్‌ అధికారులు, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌

మరిన్ని వార్తలు