పోలీసుల అదుపులో స్ట్రీట్ ఫైట్ నిందితులు

13 May, 2015 21:39 IST|Sakshi

హైదరాబాద్: స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన నబీల్ కేసులో మీర్‌చౌక్ పోలీసులు బుధవారం తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మీరాలంమండి పోలీసు లైన్ ప్రాంతానికి చెందిన నబీల్ మహ్మద్ (17) స్ట్రీట్ ఫైట్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొమ్మిది మంది యువకులపై కేసులు నమోదు చేశారు.

మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), మహ్మద్ ఉమర్ బేగ్ (20), ఇర్ఫాన్ పఠాన్ (22), సుల్తాన్ మీర్జా (22), ఎం.ఎ. కవి ఆలియాస్ ఓబేద్ (18), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (20), అబుబాకర్ (19), సులేమాన్ (18), సయ్యద్ యూసుఫ్ అహ్మద్ (19)లపై పోలీసులు ఐపీసీ 302, 201, 109, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు