నేడు ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

6 Jan, 2018 03:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాత ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని శుక్రవారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల్లో శనివారం తీవ్రంగా, ఆదివారం సాధారణ స్థాయిలో చలిగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో సాధారణం కంటే 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా... ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 9, ఖమ్మంలో 10, మెదక్, రామగుండంల్లో 11 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 13, హకీంపేట, హన్మకొండల్లో 14, నల్లగొండ, నిజామాబాద్‌ల్లో 15 డిగ్రీలు రికార్డు అయ్యాయి.

మరిన్ని వార్తలు