సరిహద్దుపై డేగ కన్ను

11 Apr, 2019 15:14 IST|Sakshi
ముక్కిడిగూడెంలో గ్రామసభ నిర్వహిస్తున్న సీపీ, డీసీపీ

ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు 

ప్రాణహిత నది తీరంపై నిఘా 

వేమనపల్లి: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఒకవైపు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేపై మావోలు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దీం తో తెలంగాణ మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాణహిత, గోదావరి నదీ తీరం వెంటా డేగకళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నేడు పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతుండగా గ్రా మాలు అప్పటికే పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లి పోయాయి. ప్రాణహితానది అవతలి వైపున్న గడిచిరోలి జిల్లా అభయారణ్యం మావోయిస్టులకు షెల్టర్‌జోన్‌. ఎతైనా.. గుట్టలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల స మయంలో మావోలు తమ ఉనికి చాటుకునేందుకు అవకాశాలున్నాయి.

దీంతో ముందు జాగ్రత్తగా పోలీస్‌ బలగాలు నిఘా తీవ్రతరం చేశాయి. ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఆటంకం కలగకుండా అన్ని పీఎస్‌లపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట రామగుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షితా కే. మూర్తి  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చో టులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.  సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి గ్రామాల్లో ఓటింగ్‌ సరళి పెంచేందుకు గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మా ర్చి 26న తీరం వెంట భారీ కూబింగ్‌ నిర్వహించారు. అదే రోజు ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రా మస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుహక్కు ప్రాధాన్యత, మావోల ప్రజావ్యతిరేక విధానాలపై వివరించారు. ప్రాణహిత ఫెర్రీపాయింట్‌ల వద్దకు డ్రోన్‌ కెమెరాల సహాయంతో తీరం వెంట గస్తీ నిర్వహిస్తున్నారు. జైపూర్‌ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్‌ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 నిరంతర నిఘా.. 

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రాణాహిత తీరం వెంట నిరంతర నిఘా కొనసాగుతోంది. జిల్లాలో 53 ఒకప్పటి మావోయిస్ట్‌ ప్రభావిత గ్రామాల్లో 98 పోలింగ్‌స్టేషన్లున్నాయి. సుమారు 88 మంది మావోయిస్ట్‌ మాజీ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఉన్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించి, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని వారిని బైండోవర్‌ చేశారు. నది వెంట 16 ఫెర్రీ పాయింట్‌లుండగా వచ్చి పోయే ప్రయాణికుల మీద దృష్టి సారించారు.

పడవలు నడిపే బోట్‌రైడర్లు, జాలరులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు అనుమానిత వ్య క్తుల సమాచారం తెలుసుకుంటున్నారు. యాక్షన్‌టీంలాంటి వాటి సంచారాన్ని తిప్పికొట్టేందుకు కౌంటర్‌ యాక్షన్‌ టీం, క్యూఆర్టీ, టాస్క్‌ఫోర్స్‌ టీం లను ఏర్పాటు చేశారు. యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలను గ్రామాల్లో గోడలపై అంటించి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని  ప్రచారం చేయిస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న సుమారు 284 కల్వర్టులను ప్రత్యేకపోలీస్, బాంబ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలను నిర్వహించారు.  

>
మరిన్ని వార్తలు