సూసైడ్‌నోట్‌ రాసి ప్రియుడితో వెళ్లిపోయింది..

2 Dec, 2019 08:29 IST|Sakshi

తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసిన విద్యార్థిని

బాయ్‌ఫ్రెండ్‌తో గుంటూరు వెళ్లిన స్టూడెంట్‌

గుంటూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, కాచిగూడ: ‘నాన్నా నా శవాన్ని తీసుకెళ్లు’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ యువతి రాసిన సూసైడ్‌ నోట్‌ కలకలం రేపింది. దీంతో నారాయణగూడ పోలీసు కేసుని చాలెంజ్‌గా తీసుకుని యువతి ఆడింది నాటకమని తేల్చారు. నిజామాబాద్‌ జిల్లా నబీపేటకు విద్యార్థిని(19) హిమాయత్‌నగర్‌ గౌడ బాలికల హాస్టల్‌లో ఉంటూ కేశవ మెమోరియల్‌ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మణిరత్నం హిమాయత్‌నగర్‌ గౌడ బాయ్స్‌హాస్టల్‌లో ఉంటూ కేశవ మెమోరియల్‌ డిగ్రీ కాలేజీలోనే చదువుతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు.

గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరనే నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజులు ఇక్కడ కనిపించకుండా వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచనతో గత నెల 27వ తేదీన ‘ నా శవాన్ని తీసుకెళ్లు నాన్న’  అంటూ తండ్రికి సూసైడ్‌ నోట్‌ రాసి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్‌లో ఉంటున్న మణిరత్నం కూడా కనిపించకుండా పోయాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరులో ప్రత్యక్షం...
మణిరత్నంకు వరసకు బావమరిది అయ్యే వ్యక్తి గుంటూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ ఇంటర్‌ సిటీ ట్రైన్‌లో గుంటూరు వెళ్లారు. మణిరత్నం బావమరిది దగ్గర ఉన్నారు. మరో మూడురోజులు దాటితే మణిరత్నం మేజర్‌ కానున్నాడు. వీరిద్దరి కాల్‌ లిస్ట్‌ని, సీసీ పుటేజీలను పోలీసులు పరీశిలించారు. ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి ఆదివారం గుంటూరులోని బిగ్‌బజార్‌ వద్ద సంచరిస్తున్న ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నేడు పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. (చదవండి: ‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా