దివ్యాంగులకు సేవ చేసే సంస్థల వివరాలివ్వండి

19 Apr, 2020 09:14 IST|Sakshi

పిటిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగులకు వైద్యం అం దించే స్వచ్ఛంద సంస్థల వివరాలు అందజేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా దీర్ఘకాలంగా అనారోగ్య స మస్యలతో బాధపడే వారికి చికిత్స చేయించేం దుకు బాధితులతోపాటు వారి సహాయకులు ఆస్పత్రులకు వెళ్లేందుకు పాస్‌లు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది కె.శివగణేశ్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. 

బాధితులకు ప్రభుత్వం వలంటీర్లను ఏర్పాటుచేయాలని కోరడం సబబుకాదని, వారికి సేవలందించే స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆసక్తి చూపే వారిని పిటిషనరే గుర్తించి తమకు నివేదించాలని ధర్మాసనం సూచించింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌  ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. కరోనాకు సంబంధించి ఇత ర వ్యాజ్యాల్లో ప్రభుత్వం ఈ నెల 22 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

నాయీ బ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా?
లాక్‌డౌన్‌తో క్షౌరశాలలు మూతపడటంతో నా యీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటున్నదీ వివరించాలని ప్రభుత్వాన్ని హైకో ర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌  ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. రేషన్‌ కార్డులు లేని వారిని, ఇతర రాష్ట్రాల వారికి, వలస కార్మికులకు ప్ర భుత్వం మనిషికి 12 కిలోల బియ్యాన్ని ఉచి తంగా పంపిణీ చేసిందని, రూ.1,500 నగదు కూడా ఇచ్చిందని, అలాగే తమకూ ఇచ్చేలా ప్ర భుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ నా యీ బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు బి.ధనరాజ్‌ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ 22కి వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు