గల్ఫ్‌ ప్రవాసీలకు ‘కరోనా’ హెల్ప్‌లైన్ల ఏర్పాటు

4 Apr, 2020 02:38 IST|Sakshi

ఏపీ, తెలంగాణకు చెందిన 13 లక్షల మందికి ఉపాధి

సాక్షి, హైదరాబాద్‌ : ఉపాధి కోసం దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన లక్షలాదిమంది భారతీయులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అలాంటి వారి బంధువులకు ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఫిర్యాదు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలో హెల్ఫ్‌లైన్‌ నంబర్లును ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నంబరును కూడా అందుబాటులో ఉంచింది.

కంట్రోల్‌రూమ్‌ టోల్‌ఫ్రీ నం: 1800 11 8797, టెలీఫోన్‌ నంబర్లు: 91 11 2301 2113/ 4104/ 7905. ఈమెయిల్‌: ఛిౌఠిజీఛీ19ః ఝ్ఛ్చ.జౌఠి.జీn ప్రత్యేక సహాయం కావాల్సిన వారు విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్‌ వ్యవహారాలు) డా.టి.వీ నాగేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం నిరంతరం అందుబాటులో పనిచేస్తోంది. వీరిని సంప్రదించాలనుక్నునవారు. +91 11 4901 8480, +91 92050 66104కు కాల్‌ చేయవచ్చు.

మొత్తం 85 లక్షల మంది భారతీయులు.. 
గల్ఫ్‌ దేశాల్లో భారతదేశానికి చెందిన దాదాపు 85 లక్షలమందికిపైగా వివిధ ఉద్యోగా లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే సుమారుగా 13 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. వీరికోసం సౌదీ అరేబియాకు చెందిన భారత రాయబార కార్యాలయంలో +9714 3971 222 / 333 సంప్రదించవచ్చు. 
అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం నంబరు: +971 2 4492700 ఫోన్‌ చేయవచ్చు, అలాగే యూఏఈ ప్రభుత్వ హెల్ప్‌లెన్‌ నెంబర్లు 9712 4965228, +97192083344ను ఆశ్రయించవచ్చు.

వదంతులు నమ్మవద్దు..
కరోనా సందర్భంగా గల్ఫ్‌లో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతామని కొందరు విమాన టికెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్‌ వెల్లడించారు. అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ జరిగి, అధికారికంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగే వరకు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా