తెలంగాణలో 15వేలు దాటిన కరోనా కేసులు

29 Jun, 2020 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 5,582 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 9,559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో మరో 6 గురు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 861 ఉన్నాయి. (చదవండి : చెస్ట్‌ ఆస్పత్రిలో మరో దారుణం)

హోంమంత్రికి  పాజిటివ్‌ 
రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హోంమంత్రి మహమూద్‌ అలీకి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొన్ని రోజులుగా ఆయనకు జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నాయి. అనుమానంతో కోవిడ్‌ పరీక్షలు చేయించగా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆయన్ను సోమ వారం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

మంత్రి గన్‌మెన్ల ద్వారా కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ నెల 24న ఐదుగురు, అంతకుముందు మరో నలుగు రు గన్‌మెన్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 25న హరితహారంలో ఆయన పాల్గొన్నారు. జ్వరం రావడంతో 26న ఆయనకు పరీక్షలు జరిపారు. 28న పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు పాజిటివ్‌ 
సికింద్రాబాద్‌: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 3 రోజుల నుంచి జ్వరం, గొంతునొప్పితో బా ధపడుతున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా శాంపిల్స్‌ సేకరించారు. సోమవారం పద్మారావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులకి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులు..

మరిన్ని వార్తలు