ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్‌

5 Apr, 2020 04:51 IST|Sakshi
టన్నెల్‌ నుంచి వస్తున్న డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్‌ టన్నెల్‌ను డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ పరికరాన్ని ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్‌ పరికరాన్ని అభివృద్ధి చేసిన వాస్కులర్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ప్రతినిధులు వివరించారు. ఆదివారం నుంచి డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్‌ నుంచే రావాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు