కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్‌ కేసులు

6 Apr, 2020 15:07 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : జిల్లాలో ఈ రోజు(సోమవారం)కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యినట్లు కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది. వీరిలో సూర్యపేట పట్టణానికి చెందిన ఇద్దరితోపాటు, కుడకుడలో వచ్చిన వ్యక్తి బంధువులు.. నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన 6గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమారు 14 వార్డుల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించి కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు. (పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌)

కాగా నిర్మల్‌లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40 మంది రక్త నమూనాలు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపగా.. వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు వ్యక్తులు గత నెలలో ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు, కరోనా మహమ్మారీతో ఇప్పటికే జిల్లాలో ఒకరు మరణించినట్లు తెలిపారు. మొత్తం 97 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇంకా 22 మందికి సంబంధించిన శాంపిళ్లను పరీక్షించాల్సి ఉందన్నారు.
(కరోనా: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం)

మరిన్ని వార్తలు