‌కరోనా క‌ల‌క‌లం: జిల్లాలో 44 కేసులు

23 Jun, 2020 14:55 IST|Sakshi

సాక్షి, ఖ‌మ్మం : జిల్లాలో కరోనా వ్యాప్తి కలవరం పుట్టిస్తోంది. సోమవారం ఒక్క రోజే 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం ఎన్ఎస్టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా వైరస్‌ సోకడంతో ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క‌రోనా బారిన ప‌డిన వారందరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. (మార్కెట్‌లోకి కరోనా ఔషధం..)

సాక్షి, నాగర్ కర్నూల్ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుతోపాటు వార్డ్ బాయ్‌కు క‌రోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో ఆస్ప‌త్రి సిబ్బంది భ‌యాందోళ‌న‌కు గుర‌వుతోంది. ఆస్ప‌త్రి సిబ్బంది నుంచి వీరితో స‌న్నిహితంగా మెలిగిన వారి వివ‌రాలు అధికారులు సేక‌రిస్తున్నారు. కాగా జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారించిన‌ట్లు క‌లెక్ట‌ర్ శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. వీరిలో ల్దండ మండలం కొట్రకు చెందిన ఒకరు. నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లికి చెందిన ఒకరు. బిజినపల్లి మండలం గంగారనికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్  నమోదు అయిన‌ట్లు తెలిపారు. (20,369 పరీక్షలు : 462 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు