‘వ్యాక్సిన్‌ అనుమతి కోసం కేసీఆర్‌కు లేఖ’

2 Jun, 2020 14:13 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌కు మందు‌ కనిపెట్టానని టాలీవుడ్‌ దర్శకుడు టి. ప్రభాకర్‌ పేర్కొంటున్నారు. తన చదువు, అర్హత చూడకుండా ఈ వ్యాక్సిన్‌కు అనుమతినివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. తాను కనిపెట్టిన సహజసిద్దమైన ఔషధంతో గొంతులోనే కరోనా వైరస్‌ నశిస్తుందని, దీనికి నాలుగు నుంచి ఎనిమిది రోజుల సమయంపడుతుందని తెలిపాడు. (కరోనా ఇప్పటికే ప్రాణాంతకమే : డబ్ల్యూహెచ్‌ఓ)

అవసరమైతే తొలి ప్రయోగం తనపై చేసుకోవడానికి సిద్దంగా ఉన్నానని, కరోనా వైరస్‌ను నేరుగా తన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశపెట్టినా 8 నుంచి 12 రోజుల్లో తన శరీరం నుంచి ఈ వైరస్‌ను పూర్తిగా తొలగించుకోగలనని ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం 4 కరోనా పేషెంట్లపై ఈ ప్రయోగం చేసే అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు దర్శకుడు విన్నవించుకున్నాడు.  (‘క్వారంటైన్‌ ఉల్లంఘించాను.. క్షమించండి’)  

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా కరోనా ముప్పు ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ పేర్కొన్నారని, అదేవిధంగా బ్రిటన్‌, ఇటలీ ప్రధానులు అసలు కరోనాకు టీకానే రాదని ప్రకటించిన విషయాలను గుర్తుచేస్తూ తను కనిపెట్టిన వ్యాక్సిన్‌తో ఇవన్నీ తప్పని నిరూపిస్తానని స్పష్టం చేశారు. తను కనిపెట్టిన మందుకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేవని, వందలకోట్ల బడ్జెట్లు అవసరం లేదని, ఏళ్ల గడువు అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్‌కు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. కిష్కింధకాండ, బతుకమ్మ, తుపాకిరాముడు చిత్రాలకు టి.ప్రభాకర్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్‌; ప్రధానికి ఫైన్‌)

దర్శకుడు టి​.ప్రభాకర్‌ కేసీఆర్‌కు రాసిన పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు