పరీక్షా సమయంలోనూ ఆన్‌లైన్‌ స్కూలింగ్‌

28 Mar, 2020 13:40 IST|Sakshi

కొడుకు, కూతురు ఫోటోలను ట్వీట్‌ చేసిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్ : సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ వేదికగా కరోనా ఆంక్షల మూలంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు దృష్టికి తెస్తున్నారు. ట్విటర్‌ సందేశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటికి పరిష్కారం చూపాల్సిందిగా తన కార్యాలయ సిబ్బందిని కేటీఆర్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. (కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు)

‘పరీక్షా సమయంలోనూ ఆన్‌లైన్‌ స్కూలింగ్‌ జరుగుతోంది. నా కొడుకు, కూతురు వాళ్లవాళ్ల పనులు చేసుకుంటున్నారు’ అంటూ ఫోటోలను జత చేశారు. కేటీఆర్‌ పిల్లలు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న ఫోటోలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రతీ ప్రభుత్వ పాఠశాలను డిజిటలీకరించాలని, అందుకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ వ్యవస్తను బలోపేతం చేయాలని సూచించారు. 

నేను సర్‌ను కాదు.. సోదరుడిని..!
కేటీఆర్‌ సర్‌.. ప్రస్తుత పరిస్థితుల్లో మీ పనితీరును హృదయ పూర్వకంగా అభినందిస్తున్నా. కేసీఆర్‌ నాయకత్వంలో మీరు చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని జనసేన అధ్యక్షులు, సినీ హీరో పవన్‌ కళ్యాణ్‌ ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ను అభినందించారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ ‘మీరు ఎప్పటి నుంచి నన్ను సర్‌ పిలవడం ప్రారంభించారు. నేను ఎప్పటికీ మీ సోదరుడినే’ అని బదులిచ్చారు. (తెలంగాణ: ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్)

మరిన్ని వార్తలు