కరోనా క్రైసిస్‌: పొలిమేర, కేవీఆర్‌ గ్రూప్‌ సాయం

10 Apr, 2020 08:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేదవారు, దినసరి కార్మికులకు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి పరిస్తితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో వారిని అదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఏ ఒక్క పేదవాడు ఉపవాసంతో ఉండకూడదని ఇప్పటికే పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు తమకు తోచిన సహాయసహకారాలు అందిస్తున్నాయి. 

తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో కొంత మంది పేదవారినైనా ఆదుకోవాలని పొలిమేర, కేవీఆర్‌ గ్రూప్‌ తమ వంతు సాయాన్ని ప్రకటించాయి. నగరంలోని నిజాంపేట, మియాపూర్‌, బాచుపల్లి, తదితర పరిసర ప్రాంతాల్లోని దాదాపు 4000 మందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా పొలిమేర, కేవీఆర్‌ గ్రూప్‌ నిర్వాహకులు గణేష్‌ రెడ్డి, కేతు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షభ సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరం. భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజిక స్పృహతో సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలి’అని అన్నారు. విపత్కర సమయంలో పొలిమేర, కేవీఆర్‌ గ్రూప్‌ గొప్ప మనుసు చాటుకున్నాయిన నెటిజన్లు హర్హం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా