కాస్త ఊరట! 

11 Jul, 2020 03:25 IST|Sakshi

10,354 పరీక్షలు.. 1,278 కేసులు.. 8 మంది మృతి

పాజిటివ్‌ రేటు 12.34 శాతమే 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉధృ తంగా విస్తరిస్తున్న కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. ఒక్కరోజులో 10వేలకు పైగా పరీక్షలు నిర్వ హించినా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగి స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 10,354 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,278 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంటే పాజిటివ్‌ రేటు 12.34 శాతం మాత్రమేనని పేర్కొంది. తాజా కేసు లతో కలిపితే రాష్ట్రంలో కేసుల సంఖ్య 32,224కి చేరింది. ఇం దులో 12,680 యాక్టివ్‌ కేసులుండగా.. 19,205 మంది కోలుకున్నారు.

శుక్రవారం మరో 8 మంది కరోనాతో మరణించగా  మర ణాల సంఖ్య 339కి పెరి గింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ ఎంసీ పరిధిలో 762 ఉండగా.. రంగా రెడ్డిలో 171, మేడ్చల్‌లో 85, సంగా రెడ్డిలో 36, నల్లగొండలో 32, కామా రెడ్డిలో 23, మెదక్‌లో 22, ఖమ్మంలో 18, మంచి ర్యాలలో 17, ఆదిలాబాద్, సూర్యాపేట్‌ జిల్లాల్లో 14 చొప్పున, నారాయణపేట్, కరీంనగర్‌ జిల్లాల్లో 9 చొప్పున, వరంగల్‌ రూరల్, నిజామా బాద్‌లో 8 చొప్పున, సిరి సిల్లలో 7, మహబుబా బాద్, పెద ్దపల్లిలో 6 చొప్పున, వరంగల్‌ అర్బన్‌లో 5, సిద్ది పేటలో 4, గద్వాల, వనపర్తి, ఆసిఫా బాద్, యాదాద్రి, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1,51,109 పరీక్షలు నిర్వహించగా.. 1,18,885 మందికి నెగెటివ్‌ వచ్చినట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు