-

కరోనా మరణాలు @ 306

7 Jul, 2020 02:18 IST|Sakshi

తాజాగా 11 మంది మృతి 

మరో 1,831 మందికి పాజిటివ్‌ 

25,733కి చేరిన కేసులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 306కు చేరింది. తాజాగా కరోనా పాజి టివ్‌ కేసులు మరో 1,831 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 25,733కు చేరింది. ఇందులో 10,646 యాక్టివ్‌ కేసులుండగా.. 14,781 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఇందులో 96,485 మందికి నెగెటివ్‌ వచ్చింది.

మొత్తంగా 21.05% మందికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధికంగా 1,419 మంది కరోనా బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్‌ జిల్లాలో 117, ఖమ్మంలో 21, మెదక్, మంచిర్యాల జిల్లాల్లో 20 చొప్పున, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 9 చొప్పున, వికారాబాద్‌ జిల్లాలో 7, సూర్యాపేటలో 6, కరీంనగర్‌లో 5, జగిత్యాలలో 4, సంగారెడ్డిలో 3, గద్వాల, నారాయణపేట, యాదాద్రి, మహబూబా బాద్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో 1,340 బెడ్లు ఖాళీ...
కోవిడ్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో 1,340 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్‌–19 బాధితులకు చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి, కింగ్‌ కోఠి ఆస్పత్రి, ఛాతీ ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రులను నిర్దేశించారు. ఈ ఆస్పత్రుల్లో 2,501 బెడ్లు ఉండగా.. 1,161 బెడ్లు రోగులతో నిండిపోయాయి. ఇందులో ఇన్‌పేషెంట్లు 877 మంది ఉండగా, 284 బెడ్లు అనుమానితులతో నిండాయి. గాంధీ ఆస్పత్రిలో 1,058, కింగ్‌కోఠి ఆస్పత్రిలో 239, ఛాతీ ఆస్పత్రిలో 25, ఫీవర్‌ ఆస్పత్రిలో 18 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు