కరోనా విలయతాండవం: 1,850 కేసులు

5 Jul, 2020 02:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఐదుగురు మృతి, 288కి చేరిన మరణాలు

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,312

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభి స్తూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా మరో 1,850 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 6,427 నమూనాలు పరీక్షించగా, అందులో 4,577 నెగెటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తాజా కేసు లతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,312కు చేరింది. ఇందులో 10,487 యాక్టివ్‌ కేసులు ఉండగా, 11,537 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కరోనాతో మరో ఐదుగురు చనిపోగా, ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 288కి చేరింది. రాష్ట్రంలో మొత్తంగా 1,10,545 నమూనాలను పరీక్షించగా, 83,656 నెగెటివ్‌ వచ్చాయి.

గ్రేటర్‌లో 1,572 మందికి..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా జీహెచ్‌ఎంసీలో 1,572 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 92, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌లో 17, నల్లగొండలో 10, సంగారెడ్డిలో 8, ఖమ్మంలో 7, వరంగల్‌ రూరల్‌లో 6, జగిత్యాల, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో 5 చొప్పున, భూపాలపల్లిలో 4, సిరిసిల్ల, కొత్తగూడెం, వికారాబాద్, జనగామ జిల్లాల్లో 3 చొప్పున, గద్వాలలో 2, నిర్మల్, భువనగిరి, మెదక్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. 

>
మరిన్ని వార్తలు