మహానగరంలో వెంటాడుతున్న కోవిడ్‌ భూతం! 

1 Jul, 2020 08:56 IST|Sakshi

పెరుగుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలను కరోనా భూతం వెంటాడుతోంది. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 869 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 29, మేడ్చల్‌ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.   

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఆగడం లేవు. తాజాగా పరిపాలన విభాగంలోని మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే విభాగంలో గత వారం కూడా ఓ ఉద్యోగికి కరోనా సోకిన తెలిసిందే. 

ఉప్పల్‌ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో..
ఉప్పల్‌ : ఉప్పల్‌ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో మంగళవారం ఒక్క రోజే  42 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. హబ్సిగూడలో డివిజన్‌లోని కామాక్షిపురంలో 5, హబ్సిగూడలో ఒకటి, వెంకట్‌రెడ్డినగర్‌లో 3, శ్రీరాంనగర్‌ కాలనీలో 3, రామంతాపూర్‌ డివిజన్‌లోని అరవింద్‌నగర్‌ కాలనీలో 4, విద్యానగర్‌లో ఒకటి, ఉప్పల్‌ డివిజన్‌లో భరత్‌నగర్‌లో 3, గాంధీనగర్‌లో 2, కురుమానగర్‌లో 2, విజయపురి కాలనీలో 2, బీరప్పగడ్డలో 2, నాచారంలో 3, నాగోల్‌లో 5, మల్లాపూర్‌లో 6 కేసులు నమోదయ్యాయి. రామంతాపూర్‌ నేతాజీనగర్‌ చెందిన ఓ వృద్ధుడు (65) మృతిచెందాడు. 
(ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి)

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో... 
దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మరో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. సూరారం కాలనీ వెంకట్రామ్‌నగర్‌కు చెందిన వ్యక్తి(39), బాచుపల్లికి చెందిన యువకుడు(28), చింతల్‌ మారుతీనగర్‌కు చెందిన వ్యక్తి (55), గణేష్‌నగర్‌కు చెందిన మహిళ(33), గాజులరామారానికి చెందిన వ్యక్తి (30), నిజాంపేట్‌ రాజీవ్‌ గృహకల్పకు చెందిన వ్యక్తి (33), జీడిమెట్ల గ్రామానికి చెందిన వ్యక్తి (35), మీనా క్షి ఎస్టేట్స్‌కు చెందిన వ్యక్తి(58), అపురూపా కాలనికి చెందిన వ్యక్తి (48), జీడిమెట్ల శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వ్యక్తి (45), జగద్గిరిగుట్టకు చెందిన మహిళ (35), చింతల్‌ సాయినగర్‌కు చెందిన మహిళ (52), వాణినగర్‌కు చెందిన వ్యక్తి (42), ప్రగతినగర్‌కు చెందిన వ్యక్తి (32), యువకుడు (28), యువతి (26), మరో యువకుడు (29), వ్యక్తి(39), హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన యువకుడు (26), వృద్ధురాలు (69), మరో యువకుడు (21), కొంపల్లి జయభేరి పార్కుకు చెందిన మహిళ (40), కొంపల్లి బొబ్బిలి అంపైర్‌కు చెందిన యువకుడు (20), కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (42), నిజాంపేట్‌ వెంకటనగర్‌కు చెందిన వృద్ధురాలు (68), బాచుపల్లికి చెందిన మహిళ (30)కు కరోనా సోకడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

కీసర పీహెచ్‌సీ పరిధిలో... 
కీసర : కీసర పీహెచ్‌సీ పరిధిలో కొత్తగా మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్‌ కాలనీకి చెందిన మహిళకు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు శ్రీలక్ష్మీనగర్‌కాలనీలో ఓ మహిళాకు, మండల కేంద్రమైన కీసరలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి కరోనా నిర్ధారణ అయ్యిందని కీసర మండల వైద్యాధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులను హోం క్వారైంటైన్‌లో ఉంచామన్నారు. 

కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో... 
మారేడుపల్లి : కంటోన్మెంట్‌ నాలుగు, ఐదు వార్డులలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కార్ఖానా అమరావతి కాలనీకి చెందిన తండ్రి, కొడుకులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. పికెట్‌ లక్ష్మీనగర్‌లో ఒక కానిస్టేబుల్‌ కరోనా బారిన  పడ్డారు. ముగ్గురినీ హోమ్‌ క్వారంటైమ్‌లో ఉంచినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ మీనా తెలిపారు. కరోనా పాజిటివ్‌ నివాసాల వద్ద కంటోన్మెంట్‌ సానిటేషన్‌ విభాగం అధికారులు బ్లీచింగ్‌ పౌడర్‌తోపాటు సోడియం హైడ్రోఫ్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. 

కాప్రాలో... 
కాప్రా : సర్కిల్‌ పరిధిలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 90కి చేరింది. నాచారం డివిజన్‌ బాబానగర్, చర్లపల్లి డివిజన్‌ కుషాయిగూడలో ఒక్కో కేసు, కాప్రా డివిజన్‌ గౌడపురి కాలనీలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్‌ కాగా, 54 యాక్టివ్‌ కేసులున్నాయి. 

ఘట్‌కేసర్‌ పట్టణంలో... 
ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ పట్టణంలోని సాయినగర్‌కు చెందిన మహిళ(30), ఈడబ్ల్యూఎస్‌ కాలనీకి చెందిన మరో మహిళ(58)కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. స్థానిక కౌన్సిలర్‌ కొమ్మిడి అనురాధ వైద్యసిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లే దారులను మూసివేయించారు. కాలనీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి రెడ్‌ జోన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 

సాయినగర్‌లో వృద్ధుడి మృతి 
నిజాంపేట్‌ : కరోనా లక్షణాలతో సాయినగర్‌లో ఓ వ్యక్తి మృతి సోమవారం రాత్రి మృతి చెందాడు. సాయినగర్‌లో ఉండే షేక్‌ చాన్‌బాషా(60) బోరబండలో టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. పది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఊపిరి తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందాడు. దీంతో చాన్‌బాషా అంత్యక్రియలను పీపీఈ కిట్లు ధరించి చేసేలా కార్పొరేటర్‌ కాసాని శిరీష చర్యలు తీసుకున్నారు. 

తుకారాంగేట్‌లో... 
అడ్డగుట్ట : అడ్డగుట్ట డివిజన్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తుకారాంగేట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఓ వ్యక్తి(43), ఓ మహిళ(31) కరోనా బారిన పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

కిషన్‌బాగ్‌ కొండారెడ్డిగూడలో... 
బహదూర్‌పురా : కిషన్‌బాగ్‌ డివిజన్‌లోని కొండారెడ్డిగూడలో ఓ వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనను హోమ్‌ క్వారంటైన్‌ చేశామని కిషన్‌బాగ్‌ నోడల్‌ అధికారి బాలకృష్ణ తెలిపారు. 

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో... 
వెంగళరావునగర్‌ : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19 ఉప కమిషనర్‌ ఎ.రమేష్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో నలుగురికి, ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌ డివిజన్ల పరిధిల్లో ఇద్దరు చొప్పున, బోరబండ డివిజన్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు.  

ఎల్‌బీనగర్‌ పరిధిలో... 
ఎల్‌బీనగర్‌ : జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్‌ çమూడు సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తుది. వారం రోజులుగా వైరస్‌ వ్యాప్తి ఉధృతం కావడంతో 107 మంది మంచానికే పరిమితయ్యారు. మరికొందరు గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. కేవలం మంగళవారం ఒక్కరోజే చంపాపేట, çహయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్‌లలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్‌ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అనుమానితులను హోం క్వారంటైన్‌లలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.   

మరిన్ని వార్తలు