కరోనా వ్యాప్తి: హిజ్రాలపై తప్పుడు ‍ప్రచారం!

30 Mar, 2020 11:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నకొందరు ఆకతాయిల ఉదంతం మరువకముందే.. హైదరాబాద్‌లో మరో పిచ్చి ప్రచారం మొదలైంది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్‌ సోకుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్‌ 100 కు ఫోన్‌ చేయండి’అని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పోస్టర్లు బయటపడటంతో కలకలం రేగింది. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, ఫేక్‌ న్యూస్‌, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని  ట్రాన్స్‌జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(చదవండి: కరోనా : ఈశాన్య విద్యార్థులపై జాతి వివక్ష)


అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే సమాజానికి దూరంగా బతుకుతున్నామని, తామూ మనుషులమేనని గుర్తించాలని క్రుంగిపోతున్న హిజ్రాలకు ఇదో ఇబ్బందికర పరిస్థితి తెచ్చినట్టయింది. ఇదిలాఉండగా.. కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులపై ప్రాంతీయ వివక్ష వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను సూపర్‌ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దేశా రాజధాని ఢిల్లీలో సైతం.. మణిపురికి చెందిన ఓ అమ్మాయిని ఒకడు ‘కరోనా’అని పిలిచి అవమానించాడు.

(చదవండి: పెళ్లి పేరుతో మోసం చేశాడు..)
(చదవండి: లాక్‌డౌన్‌ను పొడిగించం: కేంద్రం)

మరిన్ని వార్తలు