బస్తీల్లో హైరానా.. వామ్మో కరోనా

3 May, 2020 02:18 IST|Sakshi

గ్రేటర్‌ మినహా 83 చోట్ల కంటైన్మెంట్‌ జోన్లు 

వాటి పరిధిలో 90వేల ఇళ్లు.. 4 లక్షల మంది 

కొత్త కేసులను బట్టి కంటైన్మెంట్‌ జోన్ల ఎత్తివేత 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి పట్టణ ప్రాంతాలను కలవరపరుస్తోంది.తొలుత హైదరాబాద్, కరీంనగర్‌ నగర పాలక సంస్థల పరిధిలోనే ఈ వైరస్‌ కనిపించినా.. మర్కజ్‌ ఘటన అనంతరం మిగతా మున్సిపాలిటీలకు కూడా పాకింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా నగర/పురపాలక సంస్థల పరిధిలోని 83 చోట్ల ఈ వైరస్‌ పాగా వేసింది. ఈ ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా అష్టదిగ్బంధం చేసింది. రాష్ట్రంలో వారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రభుత్వం.. కొత్త ప్రాంతాలకు ఈ వైరస్‌ విస్తరించకుండా జాగ్రత్తపడుతోంది. మొదట కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్‌ అర్బన్, గద్వాల, సూ ర్యాపేట, వికారాబాద్‌ పట్టణాల్లో కోవిడ్‌–19 కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలతో కొత్త కేసుల నమోదు దాదాపుగా తగ్గిపోగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే వాటి వ్యాప్తి కాస్తో కూస్తో కనిపిస్తోంది.లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ ఇరుకిరుకు గదుల్లో నివాసాల వల్ల పాజిటివ్‌ కేసులు నమోదైన కుటుంబ సభ్యులకే ఎక్కువ మందికి సంక్రమిస్తుండడంతో వైద్యపరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాకుండా మిగతా ప్రాంతాల్లో 271 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 83 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. ఈ జోన్ల పరిధిలోకి వచ్చే 90,256వేల గృహాలు.. 3,93,474 మందిని అష్టదిగ్బంధం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తొలుత 151 కంటైన్మెం ట్‌ జోన్లు ఉన్నప్పటికీ, వాటి పరిధిలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో దశలవారీగా వాటిని ఎత్తివేస్తోంది. కాగా ఈ జోన్ల విషయంలో కొత్త కేసులు వెలు గు చూసినా.. లేకపోయినా 28 రోజులపాటు కంటైన్మెంట్‌ జోన్లను కొనసాగిం చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు