నిన్నటి వరకూ గ్రీన్‌ జోన్‌.. ఇవాళ 4 పాజిటివ్‌

10 May, 2020 14:40 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : నిన్నటి వరకు ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్‌లో ఉన్న యాదాద్రి జిల్లాలో తాజాగా కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. జిల్లాలో తొలిసారిగా ఒకేరోజు నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆత్మకూరు(ఏం) మండలం పల్లెర్లలో ముగ్గురికి, సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా వీరందరూ ఈ నెల 5వ తేదీన ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులు. పల్లెర్ల నుంచి మరో ఆరుగురిని, జనగాం నుంచి మరో నలుగురిని బిబినగర్ నిమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇక తెలంగాణలో శనివారం నాటికీ కేసుల సంఖ్యా చుస్తే... గత కొన్నిరోజుల నుంచి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతూ వస్తున్న కరోనా కేసులు నిన్న పెరిగాయి. శనివారం ఏకంగా రాష్ట్రంలో 31 కేసులు నమోదు అయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధి లోనే 30 కేసులు నమోదు కావ డం ఆందోళన కలిగిస్తోంది. మరో కేసు ముంబై నుంచి వచ్చిన వలస వ్యక్తి అని అధికారులు తెలిపారు. కరోనాతో ఓ వ్యక్తి శనివారం చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరుకుంది. ఇక కరోనా కట్టడికి గాను తెలంగాణ ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే.

చదవండి : 
దేశంలో కరోనా విలయం.. మరో 3,277
మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు