కరోనా దెబ్బతో  ఊడిన ఉద్యోగాలు 

13 Apr, 2020 12:14 IST|Sakshi

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 మందికి స్వస్తి

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం  

సాక్షి, కరీంనగర్‌: అవును.. వారు రోడ్డునపడ్డారు. కరోనా ప్రభావం.. నిధుల లేమి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శాపంగా మారింది. ఈ మేరకు ఉద్యాన శాఖలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నుంచి విధుల్లోకి రావొద్దని స్పష్టం చేయగా, 15 ఏళ్లుగా సేవలందిస్తున్న సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వయసు పైబడటం.. ఇతర మార్గాలు లేకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్‌లో 5 శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్‌డౌన్‌ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 1 నుంచి విధులకు హాజరు కానక్కర్లేదని సదరు ఔట్‌సోరి్సంగ్‌ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యాన విస్తరణాధికారులు, అకౌంటెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్లు,  అటెండర్‌ ఉద్యోగాలు పోయినట్లే.

దశాబ్దానికిపైగా సేవలు.. 
ఉద్యాన పంటల సాగులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తొలి 5 స్థానాల్లో ఉంది. సాధారణ పంటలకు సమీపంగా ఈ పంటలను పండిస్తున్నారు. ఏటా దాదాపు 75 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 53 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో మామిడి దిగుబడి ఉమ్మడి జిల్లాలోనే ఉంది. ఇతర జిల్లాల ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో కరీంనగర్‌ జిల్లాలో జిల్లా అధికారి, ముగ్గురు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఉద్యాన అధికారులు ఒక్కొక్కరూ ఆరేడు మండలాల వ్యవహారాలను చూస్తున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఉద్యాన విస్తరణా«ధికారులను ఔట్‌సోరి్సంగ్‌ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు, నాలుగు మండలాల పరిధిలో సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందే. 

ఆరు నెలలుగా అందని వేతనాలు.. 
ఉద్యాన శాఖకు కేటాయించే నిధులతోనే ఔట్‌సోరి్సంగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటారు. బిందు, తుంపర సేద్యం, పందిరి తోటలు, షెడ్‌నెట్‌ ఇతరత్ర పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం.. లబి్ధదారులకు సకాలంలో సేవలందేలా చూడటంలో వీరి బాధ్యత గత నవంబర్‌ నుంచి వీరికి వేతనాలు రాకపోగా ఉద్యోగాల నుంచి తొలగింపు ఉత్తర్వు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో నీటిని పొదుపుగా వాడుకునేలా.. ఉద్యాన పంటలను ప్రొత్సహించేలా చర్యలుంటాయన్న సమాచారంతో తమ ఉద్యోగాలకు భరోసా ఉంటుందని వేతనాల్లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని ఔట్‌సోరి్సంగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, మే నుంచి విధులకు రావొద్దని ఔట్‌సోరి్సంగ్‌ ఉద్యోగులకు చెప్పామని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు