క‌రోనా.. విరాళం ప్ర‌క‌టించిన కిష‌న్‌రెడ్డి

1 Apr, 2020 21:01 IST|Sakshi

పీఎం-కేర్స్ నిధికి విరాళం ప్ర‌క‌టించిన‌ కిషన్ రెడ్డి

ప్రజలంతా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాల‌ని పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌-19పై(క‌రోనా వైర‌స్‌) వ్య‌తిరేక పోరాటానికి తమ వంతు సాయంగా ప‌లువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటితోపాటు ఒక‌ నెల జీతాన్ని పీఎం కేర్స్ ప్ర‌త్యేక నిధికి విరాళంగా ఇస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించారు. 2020-21 సంవ‌త్స‌రానికిగానూ ఎంపీల్యాండ్స్ నిధుల నుంచి ఆ కోటి రూపాయ‌ల‌ను కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. (‘కరోనా కంటే దాని వల్లే ఎక్కువ మరణాలు’)

దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలను, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో కరోనా సహాయ కార్యక్రమాలకోసం మరో రూ.50లక్షలను ఇస్తున్నట్లు తెలిపారు. విరాళాల‌కు సంబంధించిన‌ లేఖలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, ఎం‌పీ ల్యాడ్స్‌ కమిటీ చైర్మన్‌ల‌కు పంపించారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి విరాళాల రూపంలో అందజేయాలని కిష‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. (కరోనా: న్యూయార్క్‌ గవర్నర్‌ భావోద్వేగం)

మరిన్ని వార్తలు