కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం

9 May, 2020 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా లాక్‌డైన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈమిషన్‌లో భాగంగా కువైట్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువస్తున్న విమానం హైదరాబాద్‌ బయల్దేరింది. 200మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆ విమానం శనివారం రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోనుంది. కువైట్‌ ఎయిర్‌పోర్టులో రెండు వందలమంది ప్రయాణికులు చెక్‌ ఇన్‌ చేసుకున్నారు. (చదవండి : విదేశాల నుంచి వస్తే క్వారంటైన్‌కే..)

ప్రయాణికుల్లో కొందరు తెలంగాణకు చెందినవారు కాగా, మరికొందరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.వీరంతా హైదరాబాద్‌ రాగానే క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు.ఇందుకోసం హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ. 5 వేల నుంచి రూ. 30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.


 

మరిన్ని వార్తలు