2 నెలల శిశువుకు కరోనా.. క్వారంటైన్‌లోకి వైద్యులు

19 Apr, 2020 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి వచ్చిన 2 నెలల శిశువుకి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో.. అతనికి వైద్యం అందించిన వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసిన అన్ని విభాగాల సిబ్బందిని క్వారంటైన్‌‌కి వెళ్లాలని ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 200 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు సహా ఇతర సిబ్బంది ఉన్నారు.
(చదవండి : క్వారంటైన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం)

నారాయణపేట్‌ జిల్లా అభంగాపూర్‌కు చెందిన ఓ మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక రెండు నెలల వయసున్న చిన్నారి అస్వస్థత గురవడంతో నిలోఫర్‌కు తరలించారు. పరీక్షల్లో చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు పంపించారు. ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు