కరోనా : ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే ఇకపై నేరమే!

8 Apr, 2020 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. రోడ్లు, వివిధ పబ్లిక్‌, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకూ ప్రబలుతోంది. ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే అవకాశముంది. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్, లేదా ఉమ్మి వేయడం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నాం’ అని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.


(చదవండి: కరోనా పోరు: బీసీజీ టీకాతో భారత్‌కు ఎంతో మేలు!)
(చదవండి: 400 జిల్లాల్లో మహమ్మారి జాడ లేదు..)

మరిన్ని వార్తలు