కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

20 Jun, 2020 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌కు రోజు విడిచి రోజు డ్యూటీలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తప్ప మిగతా స్టాఫ్‌లో 50 శాతం మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50 శాతం వారం తర్వాత పనిచేయాలని నిర్ధేశించింది.  (చదవండి : నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!)

ప్రభుత్వం విడుదల చేసిన కొత్త డ్యూటీ గైడ్‌లైన్స్‌

  • సోమవారం నుంచి బీఆర్కే ఉద్యోగులకు కరోనా సడలింపులు 
  • 4th క్లాస్‌ ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు 
  • క్లరికల్‌ స్టాఫ్‌-సర్కిల్టింగ్‌ ఉద్యోగులకు రోజు విడిచి రోజు డ్యూటీ 
  • ప్రత్యేక ఛాంబర్స్‌ కేటాయించిన ఉద్యోగులు రోజు విధులకు హాజరు 
  • ముందస్తు అనుమతి తీసుకుంటేనే విజిటర్స్‌కు అనుమతి 
  • సెక్షన్‌ అధికారి-అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు డ్యూటీకి రాకున్నా అందుబాటులో ఉండాలి 
  • లిఫ్ట్‌లో ఒక్కసారి ముగ్గురికి మాత్రమే అనుమతి
  • పార్కింగ్‌ ప్లేస్‌లో డ్రైవర్లు అందరూ గుమ్మికూడొద్దు
  • అధికారులందరూ ఏసీలు వాడొద్దు

(చదవండి : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు