నేటినుంచి గాంధీలోనే కరోనా టెస్టులు : ఈటెల 

3 Feb, 2020 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందుతున్నాయి. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. గత 10 రోజులుగా కరోనా టెస్ట్‌లను పూణెకు పంపుతున్నాం. కానీ, ఇప్పుడు గాంధీలోనే టెస్ట్‌లు ప్రారంభించాం. గంటల్లోనే రిజల్ట్‌ వస్తుంద’ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సోమవారం గాంధీ మెడికల్ కాలేజీలో వైరాలజీ లాబ్‌, సోలేషన్ వార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల టెస్టులు గాంధీలోనే చేస్తామన్నారు. కేంద్రం కిట్స్ పంపిందని, లాబ్‌లో కిట్స్, మ్యాన్ పవర్ అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా కేస్ కూడా నమోదు కాలేదని వెల్లండించారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. గాంధీలో డెర్మటాలజీ విభాగంలో కొత్త టెక్నాలజీ ప్రారంభించామని తెలిపారు. పిల్లల్లో వినికిడి సమస్యల పరిష్కారం కోసం కూడా టెక్నాలజీ ప్రారంభించామని, క్యాన్సర్ హాస్పిటల్‌లో పెట్ స్కాన్‌ను ప్రారంభిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు.. చైనా నుంచి వచ్చిన వారిని 14 రోజులు అబ్జర్వేషన్‌ కేంద్రం స్క్రీనింగ్ చేస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు