మరో  1,410  మందికి  కరోనా

9 Jul, 2020 22:40 IST|Sakshi

రాష్ట్రంలో 30 వేలు దాటిన పాజిటివ్‌ కేసులు

ఏడుగురు మృతి.. 331కి చేరిన మరణాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరుగుతూనే ఉంది. తాజాగా 1,410 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30,946కి చేరింది. ఇందులో 12,423 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 18,192 మంది కోలుకున్నారు. గురువారం మరో ఏడుగురు మరణించగా.. రాష్ట్రంలో కరోనా మరణాలు 331కి పెరిగాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 918 ఉండగా.. రంగారెడ్డిలో 125, మేడ్చల్‌లో 67, సంగారెడ్డిలో 79, వరంగల్‌ అర్బన్‌లో 34, కరీంనగర్‌లో 32, కొత్తగూడెంలో 23, నల్లగొండలో 21, నిజామాబాద్‌లో 18, ఖమ్మంలో 12, సూర్యాపేట్‌లో 10, మెదక్‌లో 17, మహబూబ్‌నగర్, సిరిసిల్లలో 8 చొప్పున, వరంగల్‌ రూరల్‌లో 7, భూపాలపల్లిలో 6, వికారాబాద్, మహబుబాబాద్‌లో 5 చొప్పున, కామారెడ్డి, యాదాద్రి, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాల్లో రెండు చొప్పున, సిద్దిపేట, ములుగు, ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఇక గురువారం 5,954 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4,544 మందికి నెగెటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5గంటల వరకు 1,40,755 నమూనాలు పరీక్షించగా.. 1,09,809 శాంపిల్స్‌ నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు