పల్లెలకు పట్టణ సొబగులు

19 Mar, 2019 14:46 IST|Sakshi
పంచాయతీ కార్యాలయానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ బోర్డు 

విలీన గ్రామాల్లో  కార్పొరేషన్‌ సేవలు షురూ

 పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

ఇంటి నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లోనే..

సాక్షి, కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సం స్థలో విలీనమైన 8 గ్రామపంచాయతీలు పట్టణీకరణను సంతరించుకుంటున్నాయి.నగరంలో విలీ నం కావడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. విలీన గ్రామాలన్నింటినీ సమీప డివిజన్లలో కలపడంతోపాటు బోర్డులు ఏర్పాటు చేయడంతో గ్రా మాలకు నగరపాలక హంగులు కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో ప్రజ లకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కార్పొరేషన్‌ అధికారులు పనులు చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కనీస సౌకర్యాలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలను తక్కువ సమయంలోనే డివిజన్లకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రతీ విభాగానికి ప్రత్యేక అధికారులను కేటాయించి పనులు చేపడుతున్నారు.

శివారు ప్రాంతాల్లో మాదిరిగా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. విలీనం తర్వాత పన్నుల భారం లేకుండా మరో మూడేళ్ల వరకు యధావిధిగా పన్నులు వసూలు చేయనున్నట్లు సమాచారం. అ దేవిధంగా ప్రతీ ఇంటికి తాగునీటి వసతి కల్పిం చేందుకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ను అంది ంచనున్నారు. రాబోయే రోజుల్లో మిషన్‌భగీరథ కింద ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మాణం చేసి నీటి సరఫరాను మెరుగుపర్చే ప్రక్రియపై దృష్టిసారిం చారు. పట్టణానికి ధీటుగా అన్ని సౌకర్యాలు  కల్పి ంచేందుకు నిదుల కేటాయింపు సైతం చేస్తున్నా రు. ఇక గ్రామాలు నగరంలో విలీనం కావడంతో స్థిరాస్తుల విలువలు సైతం రెట్టింపవుతున్నాయి.

 
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో పారి శుధ్యం మెరుగుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు. ప్రతీ గ్రామానికి ఒక శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కు బాధ్యతలు అప్పగించి పనులు పూర్తిచేసేందుకు ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో దుమ్ముదూళి లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరి శుభ్రం చేసుకునే విధంగా చైతన్య పరుస్తున్నారు.


వీధిదీపాలకు మరమ్మతులు
గ్రామపంచాయతీల్లో వెలగని వీధిదీపాలకు మరమ్మతు చేస్తూ చీకట్లలో మగ్గుతున్న కాలనీలకు వెలుగులు నింపుతున్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాలు అందుబాటులోకి వచ్చాక, వాటిస్థానంలో తొలగించిన ఎస్‌యూ, హైమాస్‌ లైట్లను ప్రస్తుతం గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రధాన చౌరస్తాలో ఈ బల్బులను బిగిస్తుండడంతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుంటుంది. అయితే గ్రామాల ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలనే ఇబ్బంది లేకుండా గ్రామపంచాయతీ ప్రస్తుత వార్డు కార్యాలయాల్లో అధికారుల నంబర్లు అంటించారు. దీంతో ఏ అవసరమున్నా ఫిర్యాదు చేసే వీలుంటుంది.


ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు
కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో ఇక నుంచి ఇంటి అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి చెందిన డీపీఎంఎస్‌కు లింక్‌ చేశారు. ఇందు కోసం గ్రామాలకు చెందిన ఇంటి నంబర్లను సైతం తీసుకొని ఆన్‌లైన్‌ చేయనున్నారు. ఆయా గ్రామాలను అటాచ్‌ చేసిన డివిజన్‌లకు బాధ్యులుగా ఉన్న టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఇంటి అనుమతులు, ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బంది అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు పౌరసేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు నగరంలో ఏవిధంగా సేవలు అందుతున్నాయో.. విలీన గ్రామాల ప్రజలకు సైతం అదే విధంగా సేవలు అందించనున్నారు. 

వేగంగా అభివృద్ధి పనులు
విలీన గ్రామాలను నగర డివిజన్లకు ధీటుగా అభివృద్ది చేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాం. కార్పొరేషన్‌లో కలిస్తే ఎన్ని సౌకర్యాలు ఉంటా యో అన్ని కల్పిస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంచాయితీలో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, కారొబార్‌ తదితర సిబ్బందిని కార్పొరేషన్‌ వర్కర్లుగా గుర్తించాం. టౌన్‌ప్లాన్, ఇంజనీరింగ్, శానిటేషన్, వీధిదీపాలు, నీటి సరఫరా ఇలా అన్ని విభాగాల నుంచి నగర ప్రజలు పొందే సౌకర్యాలన్నీ కల్పిస్తాం. 
– సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్‌

మరిన్ని వార్తలు